మైమరపించగా రా కృష్ణా
తెలవారినా కూడా
తెలుపు వెలుగులోన నీ నలుపురంగుమేను నవ్వుతో తెలుపుపువ్వులాగా కనబడదేమిటి కృష్ణా...
కడవలతోటి నీళ్ళకొచ్చిన కూడా
నీళ్ళబిందెలోన నీ నీలిమేఘతనువు కనబడదేమిటి కృష్ణా...
స్నానమాడిన కూడా
సరసమాడే సడితోన చీరల మాటుల చిలిపి సిగ్గుగా కనబడదేమిటి కృష్ణా...
నిన్ను తలిచిన కూడా
నన్ను చేరే వేణువు రాగంలోన మధురపాటై
వినబడవేమిటి కృష్ణా...
పనులు చేసిన కూడా
అల్లరి అల్లికతీగ తీరున అల్లికుపోయి
నీ ఆట ఆడావేమిటి కృష్ణా...
గోపికలంతచేరి ఆడిపాడిన కూడా
అమ్మకొంగునిడిచి పైటకొంగులో పడచువెన్నను
తినగా పరుగునరావేమిటి కృష్ణా...
ఏమీ చేసిన కూడా
ఏదో రూపాన కనిపిస్తూ
నన్ను మరిపిస్తూ
నీలో మురిపించగా రా కృష్ణా...
Comments
Post a Comment