Posts

Showing posts from December, 2023

మైమరపించగా రా కృష్ణా

  తెలవారినా కూడా  తెలుపు వెలుగులోన నీ నలుపురంగుమేను నవ్వుతో తెలుపుపువ్వులాగా కనబడదేమిటి కృష్ణా... కడవలతోటి నీళ్ళకొచ్చిన కూడా నీళ్ళబిందెలోన నీ నీలిమేఘతనువు కనబడదేమిటి కృష్ణా... స్నానమాడిన కూడా సరసమాడే సడితోన చీరల మాటుల చిలిపి సిగ్గుగా కనబడదేమిటి కృష్ణా... నిన్ను తలిచిన కూడా నన్ను చేరే వేణువు రాగంలోన మధురపాటై వినబడవేమిటి కృష్ణా... పనులు చేసిన కూడా అల్లరి అల్లికతీగ తీరున అల్లికుపోయి నీ ఆట ఆడావేమిటి కృష్ణా... గోపికలంతచేరి ఆడిపాడిన కూడా అమ్మకొంగునిడిచి పైటకొంగులో పడచువెన్నను  తినగా పరుగునరావేమిటి కృష్ణా...  ఏమీ చేసిన కూడా ఏదో రూపాన కనిపిస్తూ నన్ను మరిపిస్తూ నీలో మురిపించగా రా కృష్ణా...

Dear diary...

Image
 

ఏకాంతం - अकेलापन - alone

Image
  మన సమాజంలో రెండు రకాల ఆలోచనలు లేదా రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నవారు, ఒకరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవారు అయితే  కొంతమంది ఒంటరిగా ఉంటే బాధపడేవారు. దీంతో ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడే వారు తమలో తామే దాక్కుంటారు.  మరొకవైపు, ఇష్టం లేకపోయినా ఒంటరిగా జీవించాల్సి వచ్చిన వ్యక్తులు, వేరొకరితో ప్రేమలో పడే వారు, అంటే వారి పిల్లలు, లేదా కుటుంబ సభ్యులు లేదా వారితో అనుబంధం ఉన్నవారు వారిని వదిలేసి వెళ్లిపోవడం వల్ల  ఒంటరితనం అనుభవిస్తారు. నిరంతరం, నిత్యం హృదయంలో చిదగ్ని రేగుతూ ఉండే ఆ హృదయం ఇంక దేనిపైనా ఆసక్తి చూపదు. అలాంటి అనాసక్తి జీవనశైలిలో ఆ మనిషి ఏం  చేస్తుంది? ఆమె మంచం మీద పడుకుంటే గంటల తరబడి అక్కడే పడుకునేది. తినాలని అనిపించదు, ఎక్కడికైనా వెళ్లాలని అనిపించదు... అలా నా  పెయింటింగ్‌లో నేలపై ఒక అయిష్టపు వొంటరితనం లో ఉన్న ఓ అమ్మాయి ముందు ఇంత అందమైన దృశ్యం ఉన్నప్పటికీ, ఆమె తనలో తాను కోల్పోయింది... కాదు...తన నుంచి తాను కోల్పోయి ఉంది.  In our society there are people with two types of thoughts or two types of mindsets, one prefers to be alone while some...